సినిమా ఇండస్ట్రీ లో మొదట ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో రూపొందించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య "జోష్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వాసు వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే నాగ చైతన్య సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.

ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మొదట నాగ చైతన్య పాత్ర మరో హీరోను అనుకున్నారట. కానీ ఆ హీరోసినిమా చేయడానికి ఒప్పుకోకపోవడంతో చివరగా చైతన్య తో ఈ మూవీ ని రూపొందించారట. ఈ విషయాన్ని ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితం జోష్ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... జోష్ మూవీ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత వాసు వర్మ నాకు దానిని వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. ఇక అది రామ్ చరణ్ తో అయితే అద్భుతంగా ఉంటుంది అని నేను అనుకున్నాను.

దానితో వెంటనే నేను చిరంజీవి గారిని కలిసి కథను వినిపించాను. కథ మొత్తం విన్న చిరంజీవి కాస్త టైమ్ అడిగాడు. ఆ తర్వాత చిరంజీవిసినిమా చరణ్ చేయడం కరెక్ట్ కాదు. వేరే వారితో చేయండి అని అన్నాడు. దానితో నేను అదే కథను నాగార్జున గారికి వినిపించాను. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో ఆ కథతో నాగ చైతన్య ను లాంచ్ చేసే అవకాశం మాకు ఇచ్చాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc