
ఈ సినిమా కంటే ముందు భీమా సినిమా చేశాడు .. ఈ సినిమా స్టోరీ కూడా కరెక్టే . ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు తగ్గ కథనే ఎంచుకున్నాడు .. కానీ ఈసారి కూడా దర్శకుని గట్టిగా నమ్మాడు . శక్తి వంచన లేకుండా సినిమాకు కష్టపడ్డాడు .. అయితే సినిమాలో కొంత భాగం తేడా కొడుతుందని అనుమానం ఉండనే ఉంది .. ఆ అనుమానమే తర్వాత నిజమైంది. ఈ సినిమాలు కంటే ముందు వచ్చిన రామబాణం విషయంలో కూడా పూర్తిగా దర్శకుని నమ్మి గంగలో మునిగిపోయాడు గోపీచంద్ .. సినిమా పరమ చెత్తగా ఉందనే విషయం తెలిసి కూడా దర్శకుడు ఏదో మ్యాజిక్ చేస్తాడని నమ్మాడు .. సగం షూటింగ్ పూర్తి అయ్యేసరికి విషయం అర్థమైంది వెనక్కు రాలేక ముందుకు వెళ్లి ప్లాఫ్ను తన ఖాతాలో వేసుకున్నాడు .
ఇక పక్కా కమర్షియల్ సినిమా గురించి కూడా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది .. దర్శకుడు మారుతీపై విపరీతంగా నమ్మకం పెట్టుకున్నాడు .. మరొ పక పెద్ద బానర్ మారుతి పై నమ్మకంతో కళ్ళు మూసుకుని సినిమా చేసేసాడు .. తర్వాత బోల్తాబడ్డాడు .. ఇలా ప్రతిసారి దర్శకుల పై అతి నమ్మకంతో కథలను ఓకే చేస్తూ వస్తున్నాడు గోపీచంద్ .. కానీ ఏ దర్శకుడు గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నారు .. అయితే ఇప్పుడు సంకల్ప రెడ్డి వంతు వచ్చింది .. ఇతడైన గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టి సక్సెస్ ఇస్తాడో లేదో చూడాలి .