
అయితే కన్నప్ప సినిమాపై భారీ అంచనాలు ఉండడానికి ప్రధాన కారణం ఈ సినిమా లో పాన్ ఇండియ హీరో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు .. రుద్ర అనే పాత్ర లో ఆయన కనిపించబోతున్నాడు .. సినిమా కి కలెక్షన్లు , టికెట్లు తెగేది కూడా ప్రభాస్ పేరు మీద అని అనడంలో ఎలాంటి సందేహం లేదు .. ఒకవేళ సినిమా కంటెంట్ బాగుంటే సినిమాకి మరింత బోనస్ అవుతుంది . ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు . కానీ తర్వాత శివ శివ శంకర అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది .. ఇక ఇప్పుడు ఇదే క్రమంలో సగమే చరి సగమై అని లవ్ సాంగ్ ని కూడా విడుదల చేశారు ..
అయితే ఈ పాట వినడానికి బాగున్న విజువల్ గా కొంత హాట్ టాపిక్ గా మారింది .. ఇందులో హీరోయిన్ ప్రీతి ముకుందన్ గ్లామర్ అలాగే మంచు విష్ణుతో ఆమె చేసే రొమాన్స్ శృతిమించిందని కంప్లైంట్ లు వస్తున్నాయి . భక్తి సినిమాలో ఇలాంటి హాట్ రత్తి పాట అవసరమా ? అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు .. అయితే సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ని ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నడేమో అని మరి కొంతమంది కూడా సెటైర్లు వేస్తున్నారు .. దీంతో ఈ పాట మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది .