టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు నటించిన సినిమాలకు హిట్ , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. ఆయన నటించిన సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక హిట్ టాక్ వచ్చిన సినిమాలకు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. అలా అద్భుతమైన స్టార్ ఈమేజ్ ను కలిగిన మహేష్ బాబు నటించిన సినిమాలు ఈ మధ్య వరుసగా రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈయన నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో భాగంగా అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను కూడా కొల్లగొట్టాయి. ఇకపోతే మహేష్ బాబు , వెంకటేష్ కొంత కాలం క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ లో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తాజాగా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.

మహేష్ బాబు నటించిన ఈ ఒక్క సినిమా మాత్రమే కాకుండా కొంత కాలం క్రితం రీ రిలీజ్ అయిన బిజినెస్ మాన్ , మురారి సినిమాలు కూడా రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టాయి. ఇలా మహేష్ బాబు హీరో గా రూపొందిన మూడు సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా ఐదు కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన రికార్డును సృష్టించాయి. ఇలా మహేష్ సినిమాలు రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: