దేశవ్యాప్తంగా వినిపిస్తున్న కన్నడ నటి పేరు రన్యా రావు. ఈమె గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ చిక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇమే కేసులో రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. ఈ స్మగ్లింగ్ ఎపిసోడ్లో ఇంతకు హీరోయిన్ పట్టించింది ఎవరు? అనే విషయం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ పైన DRI కి ఫిర్యాదు చేసింది ఎవరు? అనే విషయం పైన ఆరా తీయగా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయట వాటి గురించి చూద్దాం.


రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసింది ఆమె భర్త అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రన్యా ఎక్కువగా  విదేశీ టూర్లకు వెళుతూ ఉండడంతో ఇమే అత్తగారింట్లో ఎక్కువగా గొడవలు జరిగేవట. వివాహమైన రెండు నెలల తర్వాత నుంచే ఈమె ఎక్కువగా ఇలా విదేశాల టూర్లకు వెళుతూ ఉండడంతో తన భార్య మీద అనుమానం వచ్చి..DRI అధికారులకు తన భర్త ఫిర్యాదు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమె కదలికల మీద సుమారుగా ఆరు నెలల పాటు అధికారులు నిగా పెట్టారట.


అలా రమ్య రావు కేసులో ఐపీఎస్ అధికారి పాత్ర ఉన్నట్లుగా హోంశాఖ కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈమె ఐపీఎస్ రామచంద్రరావు పేరును కూడా ఉపయోగించిందట. అయితే ఎయిర్పోర్టులో ఉండే ప్రోటోకాల్ ప్రాంతాన్ని ఏమే గోల్డ్ స్మగ్లింగ్ కోసమే ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రామచంద్ర రావు పాత్ర ఎంతవరకు ఉందనే విషయం పైన హోం శాఖ దర్యాప్తు చేయాలని ఆదేశాలను కూడా జారీ చేసింది. మొత్తానికి రన్యా రావు కేసులో ఆమెకు సహకరించింది ఎవరు? అనే విషయం పైన సిబిఐ అధికారులు కూపీ లాగుతున్నారట.. అయితే ఈమెకు ఒక కానిస్టేబుల్ కూడా సహకరించారని చెబుతున్నారు.14.2 కిలోల బంగారాన్ని మార్చి మూడున తీసుకువస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: