తెలుగు సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఇక్కడ మంచి విజయాలు దక్కకపోవడంతో ఇతర ఇండస్ట్రీ లపై ఆసక్తిని చూపించి అక్కడ మంచి అవకాశాలను అందుకొని మంచి విజయాలను దక్కించుకొని ఇతర ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కృతి సనన్ ఒకరు. ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోకపోవడంతో కృతి సనన్ కి కూడా ఈ మూవీ ద్వారా గొప్ప గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత ఈమెకు నాగ చైతన్య హీరో గా రూపొందిన దోచేయ్ అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా ఈమె నటించిన రెండు సినిమాలు కూడా తెలుగు లో ఫ్లాప్ కావడంతో ఈమెకు ఆ తర్వాత పెద్ద స్థాయిలో తెలుగు లో అవకాశాలు దక్కలేదు. ఈమె ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఈమె వరస హిందీ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇలా తెలుగు లో నటించిన రెండు సినిమాలతో ఫ్లాప్ లను అందుకున్న కృతి సనన్ హిందీ లో మాత్రం ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: