టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనుష్క ఒకరు. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో అనుష్క తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత వరుస పెట్టి అనుష్కకు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో , స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో చాలా మూవీలు మంచి విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే అనుష్క తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇది ఇలా ఉంటే అద్భుతమైన గుర్తింపు ఉన్న కూడా అనుష్క వరుస పెట్టే సినిమాలు చేయడం లేదు. ఆచితూచి కథలను ఎంచుకుంటూ ఒక్కో సినిమా చేస్తూ ముందుకు వెళుతుంది. ఆఖరుగా అనుష్క "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం అనుష్క , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: