టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత వేగంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సక్సెస్ అవుతున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. నాని ఎప్పుడు ఒకటి లేదా రెండు సినిమాల్లో నటిస్తూ ఉండడం అలాగే సంవత్సరంలో ఒకటి లేదా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో చాలా కాలంగా సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం కూడా నాని రెండు సినిమాల్లో నటిస్తూ ఓ మూవీ ని సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ తో పాటు నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పటికే ఈ రెండు మూవీ ల నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ రెండు మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న నాని ఆ తర్వాత మూవీ ని కూడా సెట్ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నాని ప్రస్తుతం నటిస్తున్న హిట్ ది థర్డ్ కేస్ , ది ప్యారడైజ్ మూవీ ల తర్వాత సుజిత్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సుజిత్ , నాని కి ఒక కథ ను వినిపించగా ఆ కథ అద్భుతంగా నచ్చడంతో సుజిత్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయడానికి నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా నాని స్టార్ హీరోలతో సరి సమానంగా నెక్స్ట్ సినిమాల లైనప్ ను మైంటైన్ చేస్తున్నాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: