కొంత కాలం క్రితం నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా అనుదీప్ కేవీ దర్శకత్వంలో జాతి రత్నాలు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2021 వ సంవత్సరం మార్చి 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ మూవీ విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ మూవీ కి ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 16 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 4.27 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.97 కోట్లు , ఈస్ట్ లో 1.92 కోట్లు , వెస్ట్ లో 1.52 కోట్లు , గుంటూరు లో 2.09 కోట్లు , కృష్ణ లో 1.84 కోట్లు , నెల్లూరు లో 91 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.72 కోట్లు , ఓవర్సీస్ లో 4.28 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 38.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 10.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 11.3 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ద్వారా బయ్యర్లకు మొత్తం గా 27.22 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: