సినిమా ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు ఒక హీరోతో సినిమా ఓకే కాగానే కథ మొత్తం రెడీ కాకముందే సినిమాను మొదలు పెడుతూ ఉంటారు. ఇక అలా మొదలు పెట్టాక షూటింగ్ జరుగుతున్న కొద్ది ఆ సినిమా కథలో ఏదైనా లోపం జరిగినట్లయితే మధ్యలో షూటింగ్ను ఆపడం , అలాగే షూటింగ్ పూర్తి అయిన కొంత భాగాన్ని డిలీట్ చేయడం లాంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి రాజమౌళి తన సినిమాను మొదలు పెట్టే ముందు కథ తయారు అయినా కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం అత్యంత ఎక్కువ సమయాన్ని తీసుకొని ఆ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్న తర్వాతే షూటింగ్ను మొదలు పెడుతూ ఉంటాడు.

దానితో షూటింగ్ అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిర్మాతకు కూడా చాలా వరకు డబ్బులు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శకులు రాజమౌళిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి కూడా ఒక హీరోతో సినిమా ఓకే అయ్యాక కథ పనులు పూర్తి అయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయాన్ని తీసుకొని ఆ తర్వాత సినిమాను మొదలు పెడుతున్నాడు. ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కగా ముందుగానే పూర్తి చేయడంతో సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే సినిమాలతో అద్భుతమైన విజయాలను కూడా అందుకుంటున్నాడు.

ఇలా రాజమౌళి ని కేవలం అనిల్ రావిపూడి మాత్రమే కాకుండా అనేక మంది తెలుగు దర్శకులు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా స్టార్ట్ కాక ముందే ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా కంప్లీట్ చేసుకున్నట్లయితే అలాంటి సినిమాలు మంచి విజయాలను అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అని , అలాగే నిర్మాతలకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: