
గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ప్రియదర్శి రామ్ చరణ్ ఫ్రెండ్ పాత్రలో అక్కడక్కడ మాత్రమే కేవలం కొన్ని నిమిషాలు కనిపించాను.. అయితే తన పాత్రకి పెద్దగా ఇంపార్టెంట్ కాదని ప్రాముఖ్యత లేదని చాలామంది అనుకుంటూ ఉన్నారు.. వాస్తవానికి గేమ్ ఛేంజర్ సినిమా బలగం సినిమా కంటే ముందుగా ఒప్పుకున్నానని.. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఉండేవాడిని ఆ సినిమా ఎంత లేట్ అయిందో అందరికీ కూడా తెలుసు..
ఆ సినిమాలో చాలా సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసేసారని.. తన పాత్ర చాలా తక్కువగా ఉండడానికి అదే కారణమని వెల్లడించారు.. అయితే సినిమాలో నటించేటప్పుడు తనది చిన్న పాత్ర అని తెలుసు అందుకోసం తాను 25 రోజులపాటు పని చేశానని తెలియజేశారు. కానీ రెండు నిమిషాలు కూడా అందులో కనిపించలేకపోయానని తెలిపారు ప్రియదర్శి..కేవలం రామ్ చరణ్ గారి సినిమా, డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ వల్లే ఈ సినిమాలో నటించానని ఆయనతో పనిచేసే అవకాశం రావడం ఆనందం అంటూ తెలిపారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఓటీటి లో పర్వాలేదు అనిపించుకుంది ఈ చిత్రం.