
రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున హీరోగా నటించిన సంగతి అందరికీ తెలుసు. ఈ మూవీ మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. శివ సినిమా అటు నాగార్జునకి ఇటు రామ్ గోపాల్ వర్మకి ఒకేసారి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ ఏ సినిమా కూడా శివ మూవీని బీట్ చేయలేకపోయింది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జునతో సినిమా చేయడం గురించి మాట్లాడారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాగార్జునకి నాకు మధ్య చాలా మంచి రిలేషన్ షిప్ ఉంది. 35 ఏళ్లుగా మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతుంది. నేను శివ సినిమాతో నాగార్జునకి ఎంత ఫేమ్ ఇచ్చి పైకి లేపనో.. ఆఫీసర్ సినిమాతో అంతే కిందకి తోసేశాను. నేను ఈ విషయంలో చాలా సార్లు ఫిల్ అయ్యాను. చాలా చేశాను ఆఫీసర్ సినిమా కోసం కానీ వర్కౌట్ అవ్వలేదు. అయిన అయిపోయిన దాని గురించి బాధపడి, ఆలోచించి ప్రయోజనం లేదు. అయిపోయినదాన్ని ఎవరు ఏం చేయలేరు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.