బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే తెలియని వారుండారు. ఆయన గురించి పరిచయం చేయడం కూడా అనవసరం. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తర్వాతే ఎవరైనా అనడంలో అతిశయుక్తి లేదు. అమీర్ ఖాన్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు అంటే బాలీవుడ్ తో పాటుగా.. టాలీవుడ్, కాలీవుడ్ ప్రేక్షకులు కూడా చూసేవాళ్లు. ఆయనకి, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.

ఒకప్పుడు సినిమా అంటే ఇండియన్స్ అందరికీ బాలీవుడ్ మాత్రమే గుర్తొచ్చేది. బాలీవుడ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ కి పోటీగా కూడా మరే సినిమా వచ్చేది కాదు. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది మార్పులు వచ్చాయి. టాలీవుడ్ సినిమాలు దూసుకెళ్తూ.. బాలీవుడ్ ని బీట్ చేసేశాయి. అయితే ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాల గురించి అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఓ టాక్ షోకి హాజరయ్యిన అమీర్ ఖాన్, జావేద్‌ అక్తర్‌ తో కలిసి బాలీవుడ్ సినీ పరిశ్రమ పరిస్తితుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జావేద్‌ అక్తర్‌ మాట్లాడుతూ.. ' ఒకకప్పటితో పోలిస్తే ఇప్పుడు హిందీ సినిమాలకు ప్రేక్షకులు దగ్గర కాలేకపోతున్నారు. ఎందుకని మన ప్రేక్షకులు అసలు ఏమైంది' అని ప్రశ్నించారు. దానికి అమీర్ ఖాన్ ఎంతో బాధ్యతగా 'దర్శకులు, నటీనటులు ప్రాంతీయ నేపథ్యం గురించి మాట్లాడటం ఇప్పుడు కరెక్ట్ కాదు. కానీ నిజానికి సౌత్, నార్త్.. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అనేవి అసలు సమస్య కాదు. బాలీవుడ్ ఫేస్ చేస్తున్న ఈ సమస్యకు బాలీవుడ్ అనుసరిస్తున్న బిజినెస్ మోడల్ యే కారణం. ఒకప్పుడు ఓటీటీ ఆప్షన్ లేదు.. థియేటర్ కి వచ్చి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఓటీటీ ఉండడం వల్ల, సినిమా నచ్చితేనే థియేటర్ కి వస్తున్నారు. ఇలా మన సొంత బిజినెస్ మోడల్ తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నాము' అంటూ అమీర్ ఖాన్ సమాధానం ఇచ్చారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: