
అయితే అందులో ఒక సినిమా మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ వినిపిస్తుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన మనమే సినిమా ఓటీటీలో మంచి హిట్ కొట్టింది. బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా గ్లామరస్ బ్యూటీ కృతిశెట్టి నటించింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది జూన్ లో థియేటర్ లో విడుదల అయింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాక హిట్ కొట్టకపోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 8 నెలలు పట్టింది. ఈ సినిమా మార్చి 7 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే టాప్ వన్ లోకి వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుని మిలియన్ల వ్యూస్ ని సాధించింది.