నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే సినిమాల్లోకి హీరోగా పరిచయమైనా ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా అనంతరం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా సినిమాలో నటించాడు.

సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా దేవర సినిమాకు సీక్వెల్ గా పార్ట్-2 ను కూడా త్వరలోనే తీయబోతున్నారు. ఇదిలా ఉండగా.... సినిమాల పరంగా ఎన్టీఆర్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ కు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. కానీ కుటుంబం పరంగా కాస్త గందరగోళం నెలకొంది. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కు మధ్య ఏవో కొన్ని గొడవలు జరుగుతున్నట్లు ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ ఇదివరకు ఎప్పుడూ కూడా స్పందించలేదు.


తాజాగా ఎన్టీఆర్ మేనత్త ఎంపీ పురందేశ్వరి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అత్తగా ఎన్టీఆర్ నన్ను ఎప్పుడు గౌరవిస్తారని పురందేశ్వరి అన్నారు. మా అబ్బాయితో, నివేదితతో ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ఉంటాడు. ప్రతిరోజు ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. సినిమాల గురించి ఎన్టీఆర్ తో నేను ఎప్పుడూ ఏమీ మాట్లాడను. కానీ ఏదైనా సినిమా నచ్చితే మాత్రం వెంటనే ఫోన్ చేసి చెబుతాను.

ప్రొఫెషనల్ పరంగా ఎన్టీఆర్ చాలా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ సినిమాల పరంగా తన మెలకువలు అన్ని నాకు తెలుసు అని ఎంపీ పురందేశ్వరి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా మా ఇద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉందని పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతం పురందేశ్వరి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: