టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక మరికొంతమంది నటన, అందం ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక హీరోయిన్లుగా రాణించలేకపోతారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు చూడడానికి ఎంతో అందంగా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ఈ బ్యూటీ బెంగళూరుకు చెందిన అమ్మాయి. కానీ హైదరాబాదులోనే పెరిగింది. తన చదువు కొనసాగుతున్న సమయంలోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది.

అనంతరం అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమాలో ఈ బ్యూటీ నటన బాగున్నప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం నిధి అగర్వాల్ కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేవు. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.


 
ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ చిన్నది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ - డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో తాను దయ్యం పాత్ర పోషించడం లేదని నిధి అగర్వాల్ వెల్లడించారు. ఈ సినిమాలో తన రోల్ కాస్త వినోదాత్మకంగా, అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని నిధి అగర్వాల్ అన్నారు. అంతేకాకుండా హీరో ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ అందరితో చాలా సరదాగా ఉంటారని నిధి అగర్వాల్ అన్నారు.


షూటింగ్ సమయంలో అందరిని నవ్విస్తూ ఉంటారని నిధి చెప్పారు. షూటింగ్ సమయంలో ప్రభాస్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తన సంతోషాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ చిన్నది పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ బ్యూటీ క్రేజ్ ఏ విధంగా మారిపోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: