
రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని ప్రేక్షకులు అన్నారు. కానీ సినిమాలో రష్మిక ఎంత అద్బుతంగా నటించినప్పటికి విక్కీ కౌశల్ ని బీట్ చేయలేక పోయింది. విక్కీ, శంభాజీ మహరాజ్ పాత్రలో జీవించేశాడని చాలా మంది అన్నారు. విక్కీ ఆ పాత్రకు ప్రాణం పోశాడాని.. నిజంగా శంభాజీ మహరాజ్ ఉండి ఉంటే ఇలా ఉండేవాడా అని అనుకునేల విక్కీ నటించడాని టాక్ వినిపించింది. ఈ సినిమా కోసం విక్కీ శారీరకంగా.. అలాగే మానసికంగా ఎంతగానో శ్రమించాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే విక్కీ కత్తి శాము, యుద్దాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు.
అయితే బాక్స్ ఆఫీసు వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 10 కోట్లకు పైనే కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఛావా సినిమా త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 11న రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.