
అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఫౌజి సినిమాపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో నటించబోతున్నారట. ఆ హీరో మరెవరో కాదు నటుడు సన్నీ డియోల్. ఫౌజి సినిమాలో నటుడు సన్నీ డియోల్ నటించడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమా షూటింగ్ అతితక్కువ సమయంలోనే పూర్తి చేసి తొందరలోనే సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం అనుకుంటున్నారట.
ఇదిలా ఉండగా ప్రస్తుతం హీరో ప్రభాస్ కు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా స్టోరీ మహాభారతంలోని బకాసురుడి గురించి ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ పేరు మీదనే ఈ సినిమా పేరును "బకా" అని పెట్టాలని ప్రశాంత్ నీల్ నిర్ణయం తీసుకున్నారట. అయితే మహాభారతంలో బకాసురుడిని భీముడు చంపాడు. మరి ఈ సినిమాలో ప్రభాస్ బీముడి పాత్రను పోషిస్తారా లేదా మరేదైనా పాత్రని పోషిస్తారా అనే సందేహంలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తే కానీ అసలు విషయం తెలియదు.