
ఇటీవల ఆయన తన తల్లి గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన తల్లి సూసైడ్ చేసుకోని చనిపోయిందని చెప్పాడు. అప్పుల బాధకే తాను అలా చేసిందని తెలిపాడు. ఎంత ప్రయత్నించినప్పటికి తన తల్లిని కాపాడుకోలేక పోయాడని బాధపడ్డాడు. అయితే అతని భార్య కవిత ఇస్మార్ట్ జోడీలోకి అడుగు పెట్టకనే గర్బవతి అయ్యింది. అయినప్పటికీ వారిద్దరూ ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ జంటకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఆదిరెడ్డి, కవిత జంట ప్రస్తుతం టాప్ 3లో ఉన్నారు. అంతకుముందు టాప్ 2 లో ఉండే ఈ జంట.. ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన ప్రేరణ, శ్రీపాద్ జంట కారణంగా టాప్ 3 లోకి వచ్చేశారు.
ఇక ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకొని.. మూడో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ 3లో కూడా అందరూ మెచ్చిన, అందరికీ నచ్చిన యాంకర్ ఓంకార్ యే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లోకి తొమ్మిది ఇస్మార్ట్ జంటలు అడుగుపెట్టాయి. ప్రదీప్- సరస్వతి, అనిల్ జీలా- ఆమని, అలీ రెజా- మసుమా, రాకేష్- సుజాత, వరుణ్- సౌజన్య, యష్- సోనియా, మంజునాథ- లాస్య, ఆదిరెడ్డి- కవిత, అమర్ దీప్- తేజు జంటలు ఈ షోలో పాల్గొంటున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో అమర్ దీప్, తేజు మొదటి స్థానంలో ఉన్నారు. మరి చివరికి ఏ జంట గెలుస్తుందో చూడాలి.