తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా రాజకీయా నాయకుడిగా,  నిర్మాతగా కూడా పేర సంపాదించిన నటుడు మురళీమోహన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి విషయాలను ఆయనైనా సరే చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంలో మాత్రం ఈయన పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా వందేళ్ళ క్రితం తన తాతగారు నిర్మించినటువంటి ఒక భవనాన్ని అత్యాధునిక వసులతో సరికొత్తగా తీర్చిదిద్దడం జరిగిందట మురళీమోహన్. వాటి గురించి పూర్తిగా చూద్దాం.


తన తాత నిర్మించిన ఇల్లు కావడం చేత తన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ ఇంటిని కాపాడుకోవడమే కాకుండా మరొక 50 నుంచి 60 ఏళ్ల వరకు ఆ ఇంటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేలా ఈ ఇంటిని నిర్మించారట మురళీమోహన్. అయితే ఈ ఇల్లు ఏలూరు జిల్లా చాటపర్రు లోని ప్రాంతంలో ఉన్నదట. ఇక ఈ వందేళ్లు భవనం కలిగిన ఇంటిని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ వేడుకలను కూడా చాలా ఆనందంగా నిర్వహించారట. ఇలాంటి సందర్భంలోనే గ్రామంలో ఉండే తన స్నేహితులు, బంధువులతో కలిసి చాలా ఆనందంగా గడిపినట్లు తెలుస్తోంది.



అయితే ఈ ఇల్లు చూడడానికి ఒక ఇంద్ర భవనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ఇక ఇంటి పైన పెరు "మాగంటి మురళి మోహన్ చారిటబుల్ ట్రస్ట్"అన్నట్టుగా పెట్టారు. ఇక ఇంటి లోపల కూడా చాలా విశాలమైన గదులను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంటి లోపల కూడా అధునాతన టెక్నాలజీకి సంబంధించిన వాటితోనే ఈ ఇంటిని రూపురేఖలు మార్చినట్టుగా కనిపిస్తోంది. ఈ పురాతన భవనానికి తన కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు గడపడానికి కూడా అన్ని వసతులను ఏర్పాటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనాన్ని ఇలా అధునాతన రూపంలో మార్చడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: