
అయితే ఈ అవార్డుల ప్రధానోత్సవం ఉగాదికి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చని .. వచ్చే సంవత్సరం నుంచి ఉగాది రోజున ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఒక్కో యాడాదికి ఒక్కో ఉత్తమ సినిమాకి ఈ పురస్కారం ఇవ్వబోతున్నారు . ఇక 2024 వ సంవత్సరానికి నటీనటులు ,సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులతో పాటు ఉత్తమ ఫీచర్ ఫిలిమ్, బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణం ,చారిత్రిక సంపద ,తదితర విభాగాల సినిమాలకు కూడా గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నారు ..
అదేవిధంగా యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు తొలి ఫీచర్ ఫిలిం ,నేషనల్ ఎఫెక్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫిలిం, షార్ట్ ఫిలిం ,యానిమేషన్ ఫిలిం, విభాగాల్లో పురస్కారాలు నగదు ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వంవ్వనుంది .. అలాగే తెలుగు సినిమా పై పుస్తకాలు విశ్లేషణక వ్యాసాలు రాసే ఫిలిం జర్నలిస్టులు కూడా అవార్డులు ఇస్తామని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు . అయితే ఈసారి అవార్డుల వేడుకల్లో ఇండస్ట్రీ మొత్తం ఈ ఫంక్షన్ లో కనిపించడం గ్యారెంటీ .. తెలుగు టాప్ సెలబ్రిటీలంతా ఒకే చోటుకి వస్తారు .. ఇక మరి తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులపై ఇంకా ఎలాంటి కీలక ప్రకటన ఇస్తుందో చూడాలి ..