
టాలీవుడ్ ఇండస్ట్రీలో... అనేక రకాల ఐటెం సాంగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్స్ లేకుంటే సినిమాలు అస్సలు ఉండటం లేదు. అంతలా పాపులారిటీ దక్కించుకున్నాయి ఈ ఐటెం సాంగ్స్. ఒక హీరోయిన్ కు ఇచ్చిన అంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ప్రత్యేకంగా.. ఐటెం సాంగ్స్ కోసం మరో హీరోయిన్ ని దించుతున్నారు నిర్మాతలు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. కొన్ని ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.
అందులో ఒకటి ఇప్పటికింకా నా వయసు అని ఐటమ్ సాంగ్. మహేష్ బాబు హీరోగా చేసిన పోకిరి సినిమాలో... ఈ పాటతో రచ్చ రచ్చ చేసింది ముమైత్ ఖాన్. దాదాపు 20 సంవత్సరాల కిందట ఈ సినిమా వచ్చింది. 2006 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాలో... ఐటెం సాంగ్ పెట్టి రచ్చ రచ్చ చేశారు. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాకు ముమైత్ ఖాన్ పాట... చాలా ప్లస్ అయింది అని చెప్పవచ్చు.
ఈ పాట కోసం ప్రత్యేకంగా ముమైత్ ఖాన్ కు దాదాపు 60 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 20 సంవత్సరాల కిందట తన అంద చందాలతో.. ఒక ఊపు ఊపేసింది ముమైత్ ఖాన్. ఈ పాట తర్వాత ముమైత్ ఖాన్ కు మంచి పాపులారిటీ దక్కింది. చాలా సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఈ పోకిరి ఐటమ్ సాంగ్ తర్వాత... ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టి ట్రెడిషన్ కూడా వచ్చింది. ఇప్పటికి కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను 12 కోట్లతో తీశారు. ఈ సినిమా అప్పట్లో 200 డేస్ కూడా ఆడింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తే.... నిర్మాతలుగా మంజుల ఘట్టమనేని, పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. ఈ సినిమాకు మని శర్మ మ్యూజిక్ అందించడం జరిగింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు పోలీస్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.