
అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త మూవీ సర్కిల్స్ లో గట్టి గా వినిపిస్తుంది .. ఈ సినిమా కథ కాశీ నగరం లో మొదలవుతుందని . అలా అడవులకు ఈ కథ మారుతూ వెళుతుంద ని తెలుస్తుంది .. అలాగే ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది. అలాగే రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది. ఇక దీంతో కాశి లో జరగబోయే సన్నివేశాల కోసం ప్రస్తుతం హైదరాబాదులో కాశీ కి సంబంధించిన సెట్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ..
ఇక దీంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అసలు కాశీ నగరానికి ఈ సినిమా కథ కు ఎలాంటి సంబంధం ఉండబోతుందా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా మారింది .. ఇక ఈ సినిమా లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండ గా .. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నారు .. అలాగే ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను ఎవరు ఊహించని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు .. ఇక మరి రాజమౌళి , మహేష్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారో చూడాలి ..