పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. దాదాపు 10 ఏళ్ల పాటు పవర్ స్టార్ కు బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా ఆయనకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. పవర్ స్టార్ కెరీర్ లోనే గబ్బర్ సింగ్ తిరుగులేని విజయం సాధించింది.. అయితే గబ్బర్ సింగ్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ కి రీమేక్ గా తెరకెక్కినా కూడా ఒరిజినల్ మూవీ కంటే ఎక్కువగా ఈ సినిమా అధిక ప్రేక్షకాధరణ పొందింది..ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు విలన్ గా నటించిన అభిమన్యు సింగ్ కి కూడా మంచి పాపులారీటి వచ్చింది..

పవర్ స్టార్ ని ఢీ కొట్టే విలన్ గా అభిమన్యు సింగ్ అద్భుతంగా నటించాడు.. సిద్దప్ప గా అభిమన్యు విలనిజం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..అయితే సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది..ముఖ్యంగా ‘కెవ్వు కేక’ సాంగ్ అయితే ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది..ఈ సాంగ్ లో మలైకా అరోరా తో పవన్ స్టెప్స్ థియేటర్ లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి.. ఈ సాంగ్ కోసం పవన్ యాంటీ ఫ్యాన్స్ సైతం థియేటర్స్ క్యూ కట్టారు.. అంతలా కెవ్వు కేక సాంగ్ పాపులర్ అయింది.అయితే గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు..

సాధారణంగా పవన్ కల్యాణ్ సినిమాలు యావరేజ్ గా ఉంటేనే భారీ కలెక్షన్స్ సాధిస్తాయి.. ఇక ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం.. కలెక్షన్స్ సునామినే.. గబ్బర్ సింగ్ విషయంలో కూడా అదే జరిగింది.. దాదాపు పదేళ్ల తరువాత పవన్ సినిమా సాలిడ్ హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ సైతం థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసారు..


మరింత సమాచారం తెలుసుకోండి: