
అసలు విషయంలోకి వెళ్తే..కీర్తి సురేష్ ,ఆంటోనీ స్కూల్ నుంచె వీరిద్దరూ స్నేహితులట.అప్పటికే ఆంటోని కీర్తి కంటే 3 ఏళ్లు పెద్ద.. వివాహం చేసుకునే ముందు వీరు 15 ఏళ్ల పాటు డేటింగ్ లో కూడా ఉన్నారట. కానీ ప్రస్తుతం ఆంటోనీ కంటే కీర్తి సురేష్ పెద్దదంటు చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారని ఇందులో నిజం లేదట. ఆంటోని కేరళలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఈయన కూడా ఒకరు.అలాగే ఈయనకు చెన్నైలో కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయట.విదేశాలలో కూడా పలు రకాల వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది.
అటు కీర్తి సురేష్, ఆంటోనీ సుమారుగా 15 ఏళ్లు ప్రేమించుకున్న విషయం ఎక్కడా కూడా బయటపడకుండా జాగ్రత్త పడింది కీర్తి సురేష్. చివరిగా కీర్తి సురేష్ బేబీ జాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన క్రేజ్ అయితే పెరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో రివాల్వర్ రీటా, అక్క వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నది. మొత్తానికి కీర్తి సురేష్, తన భర్త ఆంటోనీ కంటే చిన్నది అన్న విషయం తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. మరి వివాహమనంతరం తన సినిమాలతో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి కీర్తి సురేష్.