యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తన నటనతో అంచలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈయన కథను ఎంచుకుని శైలి చాలా అద్బుతంగా ఉంటుంది. డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో చోటు సొంతం చేసుకున్నాడు. కిరణ్ అబ్బవరం అటు సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూనే.. ఇటు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. 
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.  ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ నటిస్తుంది. దిల్ రూబా మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. 
ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సరేగమ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి కన్నా నీ అనే లిరికల్ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ లిరికల్ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నిర్మాత రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. 'సినిమాలో ఫైట్స్ చూసి థియేటర్ తెరని చింపి అవతల పారేస్తారు. ఒకవేళ అలా పడేయకపోతే అదే రోజు మధ్యాహ్నం నేను పెట్టె ప్రెస్ మీట్ లో నన్ను కొట్టండి. తర్వాత నన్ను బయటకు విసిరేయండి. మీకు సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను. ఇది కూడా చాలా నమ్మకంతో చెప్తున్నాను' అని నిర్మాత రవి చెప్పుకొచ్చారు.
ఇక దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు మరింత పెరిగాయి. మరి హోలీ పండుగ కానుకగా రిలీజ్ అయ్యే ఈ సినిమా హిట్ కొడుతుందో లేదో చూడాలి. నిర్మాత మాటల్లో నిజమెంత ఉందో కూడా తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: