
హీరోగా అతడు నటించిన ‘రౌడీ బాయ్స్’ ‘లవ్ మి ఇఫ్ యు డేర్’ సినిమాలు రెండు ఫ్లాప్ అవ్వడంతో అతడి కెరియర్ ఆశించినంత ఆశాజనకంగా లేకపోవడంతో దిల్ రాజ్ తన కుటుంబ వారసుడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని సంవత్సరాల క్రితం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అందుకున్న ‘శతమానం భవతి’ మూవీకి సీక్వెల్ తీయాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఈమూవీకి ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ అంటూ టైటిల్ ఫిక్స్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ప్రకటన ఇస్తూ వచ్చే సంక్రాంతికి విడుదల అని ప్రకటించారు. అయితే ఈమూవీలో ఎవరు హీరోగా నటిస్తారు మరెవ్వరు దర్శకులు అన్న వివరాలు లేవు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘శతమానం భవతి’ మూవీకి దర్శకత్వం వహించిన సతీష్ వేగ్నేశ దర్శకుడిగా ఉండకపోవచ్చు అన్న వార్తలు వస్తున్నాయి.
ఒక యంగ్ డైరెక్టర్ కు ఈసినిమా దర్శకత్వం అప్పచెపుతారని అంటున్నారు. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి అనీల్ రావిపూడి చిరంజీవిల మూవీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల భారీ బడ్జెట్ మూవీ కూడ విడుదలయ్యే ఆస్కారం కనిపిస్తోంది. దీనితో ఇంత భారీ పోటీ మధ్య దిల్ రాజ్ తన వారసుడు సినిమాను ధైర్యంగా విడుదల చేయగలడా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అయితే సినిమా రంగానికి సంబంధించిన వ్యూహాలలో దిల్ రాజ్ చాల ముందు చూపుతో ఉంటాడు అన్న పేరు ఉంది. దీనితో ఈ వ్యూహంలో ఏదో ఒక ఎత్తుగడ ఉంది అనుకోవాలి..