టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్ లకు ఐటెం సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి ఓకే చెబుతోంది ఇక రీసెంట్ గానే బ్రేకప్ బాధలో ఉన్న తమన్నా ఇప్పటివరకు అఫీషియల్ గా ఈ విషయాన్ని బయట పెట్టకపోయినప్పటికీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాత్రం బ్రేకప్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్లు చేసింది. అయితే అలాంటి తమన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్పెషల్ సాంగ్ లకి,ఐటెం సాంగ్ లకే ప్రయారిటీ ఇస్తోంది.అలా ఇప్పటికే తమన్నా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో ఆడి పాడింది.మరి ఇంతకీ తమన్నా ఇప్పటివరకు ఎన్ని ఐటెం సాంగ్స్ లో చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..

తమన్నా ఇప్పటి వరకు జై లవకుశ, జైలర్, బాలీవుడ్లో స్త్రీ 2 లో స్పెషల్ సాంగ్, కే జి ఎఫ్ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.అలా జై లవకుశ మూవీ లో స్వింగ్ జరా అనే పాటలో ఎన్టీఆర్ కి ధీటుగా తమన్నా స్టెప్పులు వేసింది. ఈ పాట ఇప్పటి కూడా యూట్యూబ్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అలాగే తమన్నా యష్ నటించిన కేజిఎఫ్ మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసింది. ఇక రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో నువ్ కావాలయ్యా అనే పాటతో సంచలనం సృష్టించింది. ఈ పాటలో కొన్ని స్టెప్పులు వివాదాస్పదం అయినప్పటికీ తమన్నాకి మాత్రం మంచి గుర్తింపు లభించింది.

అలాగే శ్రద్ధా కపూర్ నటించిన బాలీవుడ్ మూవీ స్త్రీ -2 మూవీ లో ఆజ్ కి రాత్ అనే స్పెషల్ సాంగ్ లో అలరించింది తమన్నా..ఇలా తమన్నా ఎన్నో స్పెషల్ సాంగ్ లు,ఐటెం సాంగ్ లు చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది.ముఖ్యంగా సినిమా మొత్తం చేస్తే సౌత్ హీరోయిన్లకు ఐదు నుండి ఆరు కోట్ల వరకు ఇస్తారు.అది కూడా స్టార్ హీరోయిన్స్ అయితేనే..ఇక చిన్న హీరోయిన్లకు రెండు కోట్ల లోపే పారితోషికం అందుతుంది. కానీ కేవలం రెండు మూడు నిమిషాలు ఉండే ఐటమ్ సాంగ్స్ చేస్తూ తమన్నా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.అలా ఒక్కో పాటకి మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇలా భారీగా రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: