నయనతార పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్.. అలాంటి ఈమె  చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్  మారి, చివరికి తానే సొంతంగా సినిమాలు తీసేస్తాయికి చేరుకుంది. అలాంటి నయనతార  విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని  ఇద్దరు బిడ్డలకు తళ్లయింది. ఈ విధంగా నయనతార హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో   ధనుష్ రూపంలో ఒక చిక్కచ్చి పడింది. ధనుష్ నయనతార మధ్య చాలా కాలం నుంచి అభిప్రాయ బేధాలు నడుస్తున్నాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చి చాలా సంవత్సరాలు గడిచింది..ఆ మధ్యకాలంలో నయనతార ప్రొఫెషనల్ లైఫ్  బేస్ చేసుకొని నయనతార 'బియాండ్ ది  ఫెయిరీ టైల్'  అనే డాక్యుమెంటరీ తెరకెక్కించారు. 

ఈ టైంలో నయనతార  తన భర్త విజ్ఞేశ్ శివన్ మొదటిసారి నానుమ్ రౌడీదాన్ అనే మూవీ సెట్స్ లో కలిశారు.. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ డైరెక్షన్ చేయగా ధనుష్ నిర్మించాడు. ఆయన సొంత బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం  నుండి నయనతార లైఫ్ ఆధారంగా చేసుకున్నటువంటి చిత్రంలో కొన్ని క్లిప్స్ లను వాడుకున్నారు. దీంతో ధనుష్ కోపానికి వచ్చి నిర్మాతగా నా పర్మిషన్ లేకుండా ఆ వీడియోని మీరు ఎలా ఉపయోగించారంటూ ధనుష్ పై కేసు వేశాడు. ఈ కేసు పర్మిషన్ లేకుండా సీన్స్ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం ఇయ్యమని కేసులో పేర్కొన్నారు.

ఈ కేసు ఇంకా నడుస్తున్న సమయంలోనే ఇప్పుడు మరో డాక్యుమెంటరీ విషయంలో కోట్ల డ్యామేజెస్ కోరుతూ మరో కేసు వేశారు.. దీనికి కారణం షూటింగ్ సెట్స్ లో  విగ్నేష్ నయనతార ప్రవర్తనే అని చెప్పారు. షూటింగ్ టైంలో వీళ్లిద్దరు  ప్రొఫెషనల్ గా కనిపించలేదని తరచూ విగ్నేష్ నయనతార చేసిన సీన్స్ కే ప్రాధాన్యత ఇచ్చేవాడని మిగతా వారిని పట్టించుకోలేదనే విషయంతో కేసు  ఫైల్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ విధంగా నయనతార ధనుష్ మధ్య  యుద్ధం అనేది రోజురోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: