కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అనేవి సర్వసాధారణం. కమర్షియల్ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో స్పెషల్ సాంగ్ లను మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం కమర్షియల్ మూవీలను ఎక్కువగా ఇష్టపడే జనాలు ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. దానితో తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటి నుండో సినిమాల్లో ఐటమ్ పాటలను మేకర్స్ పెడుతూ వస్తున్నారు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ ఎక్కువ శాతం చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అద్భుతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే కాజల్మూవీ లో స్పెషల్ సాంగ్ చేస్తుంది అనే వార్తలో బయటకు రావడంతో ఈ మూవీ పై జనాల్లో క్రేజ్ పెరిగిపోయింది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత కూడా ప్రేక్షకుల నుండి ఈ సాంగ్ కి అదే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

కాజల్ ఈ సాంగ్లో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సాంగ్ ద్వారా కాజల్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. జనతా గ్యారేజ్ మూవీ లో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కి అద్భుతమైన గుర్తింపు రావడంతో ఆ తర్వాత కూడా ఈమె వరస పెట్టి స్పెషల్ సాంగ్స్ చేస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ జనతా గ్యారేజ్ సినిమా వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న కాజల్ మాత్రం ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఏ మూవీ లో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: