పెళ్లయిన ప్రతి దంపతులకు మాతృత్వం అనేది ఒక మధురమైన అనుభూతి. ఈ అనుభూతిని పొందడానికి ఎవరైనా  ఎదురుచూస్తారు.. సాధారణ వ్యక్తుల నుంచి సినిమా స్టార్స్ వరకు పిల్లల కోసం పరితపిస్తున్న వారే ఉంటారు.. అలా పిల్లల కోసం  ఒక స్టార్ హీరోయిన్ పూజలు కూడా చేస్తుందట. ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ అలా కాదు పెళ్లయి పిల్లలు పెరిగిన, వాళ్ళకు పెళ్లిళ్లు అయినా సినిమాల్లో రాణిస్తూ ఉంటారు. ఆ విధంగా పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు అయిన సినిమాల్లో దూసుకుపోతున్న హీరోయిన్ కత్రినా కైఫ్. 

ఈమె తనకంటే చిన్నవాడైనటువంటి విక్కీ కౌశల్ ను వివాహమాడింది. వీరి పెళ్లి జరిగి ఇప్పటికే నాలుగు ఏళ్లు గడిచిపోయింది. అయినా పిల్లలు  పుట్టలేదు..ప్లాన్ చేసుకొని పిల్లలను కనకుండా ఉంటున్నారని చాలామంది భావించారు. కానీ అందులో నిజం లేదట..వీరు పిల్లల కోసం ట్రై చేస్తూనే ఉన్నా పిల్లలు పుట్టట్లేదని తెలుస్తోంది. తాజాగా ఈమె కర్ణాటకలోని కుక్కై సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాన్ని దర్శించుకుందట. ఈ దేవాలయాన్ని చాలామంది పిల్లలు పుట్టకపోతే దర్శించుకుని కోరికలు కోరుకుంటారు. ఆ విధంగానే కత్రినా కైఫ్ కూడా ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పిల్లలు పుట్టాలని  వరం పట్టిందట.. ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దీంతో వారి అభిమానులు ఆమెకు తొందరగా పిల్లలు పుట్టి హ్యాపీగా జీవించాలని కామెంట్లు పెడుతున్నారు. విక్కీ కౌశల్  విషయానికి వస్తే  తాజాగా చావా అనే చిత్రం ద్వారా మనం ముందుకు వచ్చారు. సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన హిట్ సాధించడంతో విక్కీ కౌశల్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయనకు వరుస ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయట. భర్త సినీ కెరియర్లో సెట్ అయ్యాడు కాబట్టి కత్రినా కైఫ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పిల్లల్ని ప్లాన్ చేయాలని  అనుకుంటుంది అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.. మరి చూడాలి ఈ వార్తలో నిజం ఎంతుందో, అబద్దం ఎంతుందో వారు స్వయంగా స్పందిస్తే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: