
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల లో మహేష్ బాబు - రాజమౌళి ప్రాజెక్టు ఒకటి. SSMB 29 పేరుతో తెరకెక్కే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా గ్లోబల్ మూవీ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టు కథ కాశీ నగరం లో మొదలవుతుందని .. అటుపై అడవులకు ఈ కథ షిఫ్ట్ అవుతుందని ... కాశీ నగరానికి అడవులకు లింక్ ఉంటుందని చెపుతున్నారు. ఈ క్రమంలో నే కాశీలో జరగబోయే సీన్ల కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో కాశీ నగరం సెట్ వేస్తున్నట్లు సమాచారం. కాశీ నగరం అంటేనే మన దేశానికి.. హిందువులకు ఎంత పవిత్రమైన నగర మో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కాశీ అంటే మనం ఆ పరమేశ్వరుని నిలయంగా చూస్తాము. ఈ సినిమా లో శివుడి సెంటిమెంట్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
కాశీ నగరానికి ఈ సినిమా కథలో ఎలాంటి లింక్ ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది. తాజాగా మహేష్ బాబును కొడుతూ తీసుకు వెళుతున్న క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రాజమౌళి సోదరుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.