కేజీఎఫ్ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ సినిమా ఒక యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ సినిమా. ఈ సినిమా చాప్టర్ 1, చాప్టర్ 2 తో కోట్లల్లో కలెక్షన్ వసూలు చేసింది. కేజీఎఫ్ 1, 2 కి క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 3కి ఉంది. ఇటీవలే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 3 టీజర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ చాప్టర్ 3 కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
అయితే కేజీఎఫ్ చాప్టర్ 1లో గరుడ అనే విలన్ పాత్రలో నటించిన వ్యక్తి మీకు గుర్తున్నాడా. గరుడ పాత్రలో నటించిన వ్యక్తి పేరు రామచంద్ర రాజు. ఈయన తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం సినిమాలో కూడా నటించాడు. గరుడ పాత్రలో నటించి మంచి  కీర్తిని సంపాదించుకున్నాడు. ఈయన తెలుగులో మహా సముద్రం, భీమ్ల నాయక్, సలార్ సినిమాలలో నటించాడు. ఈయన ఇస్లాం మతంలోకి మరరానే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రామ్ ఇస్లాం మతంలోకి మరట్లేదని.. ఆయన కేవలం మసీదుని సందర్శించారని, ఆ సందర్భంలో తీసుకున్న ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తేలింది. ఆయనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం అయ్యింది.

 
కేజీఎఫ్ మూవీలో హీరోగా యష్, హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. విజయ్ కిరాగందర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అనంత్ నాగ్, అచ్యుత్ కుమార్, మల్విక అవినాష్, అర్చన జోయిస్, లక్ష్మణ్, అయ్యప్ప పి శర్మ, హరీష్ రాయ్, యష్ శెట్టి తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: