- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ రాబిన్‌హుడ్ ’ ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. గ‌త యేడాది చివ‌ర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప‌లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ మార్చి 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. గ‌తంలో నితిన్ కు భీష్మ లాంటి సూప‌ర్ హిట్ అందించిన స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే ఉంది . . అటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ బిజినెస్ బాగానే జ‌రుగుతోంది.


రాబిన్ హుడ్ సినిమా  నుంచి ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో మూవీ పై అంచ‌నాలు పెట్టుకుంది చిత్ర యూనిట్‌. ఇక తాజా గా నిర్వ‌హించిన ప్రెస్ మీట్లోనూ హీరో నితిన్ ఇదే విష‌యాన్ని రివీల్ చేశాడు. ఇప్ప‌టికే ఈ సినిమాను తాను చూశాన‌ని .. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల తో పాటు త‌న కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ గా నిలుస్తుంద‌న్న ఆశాభావాన్ని నితిన్ వ్య‌క్తం చేశాడు. ఈ సినిమా తో తాను ఖ‌చ్చితంగా హిట్ కొట్టి తీరుతాన‌ని అంటున్నాడు. ఇక మార్చి 28న ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్‌కు షెడ్యూల్ అయ్యింది. ఆ సినిమా వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేకపోవ‌డంతోనే నితిన్ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా అదే డేట్‌కు వ‌స్తుంద‌ని స్పీడ‌ప్ చేస్తున్నారు.



రాబిన్ హుడ్ సినిమా లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వ‌చ్చే నెల లో నితిన్ న‌టిస్తోన్న మ‌రో సినిమా త‌మ్ముడు కూడా రిలీజ్ కు రెడీ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: