తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువ సమయంలో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నలలో శ్రీ లీల ఒకరు. ఈ బ్యూటీ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ధమాకా మూవీ తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాల్లో బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ బ్యూటీ నటించిన సినిమాల్లో తన అందాలతో , నటనతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు అపజయాలు వచ్చిన కూడా ఈమె గుర్తింపు మాత్రం ఏమీ తగ్గలేదు.

ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభించిన తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. శ్రీ లీలా , అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లోని కిసిక్ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ సినిమా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఈ మూవీ లోని కిసిక్ అంటూ సాగే ఐటెం సాంగ్ కి కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడం అలాగే ఇందులో శ్రీ లీల తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ ద్వారా ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఇక కెరియర్ ను ప్రారంభించిన చాలా తక్కువ సమయం లోనే స్పెషల్ సాంగ్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ రాబోయే కాలంలో మరిన్ని స్పెషల్ సాంగ్స్ లలో నటించే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: