ఇది నిజంగా సమంత తీసుకున్న సెన్సేషనల్ డెసిషన్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో మగవాళ్ళని ఒకలా.. ఆడవాళ్లను ఒకలా చూసేవారు . అది ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా సరే .  మగవాళ్ళకి ఒకలా వేత్తనం ఇచ్చేవారు..ఆడవాళ్లకి ఒకలా వేత్తనాని ఇచ్చేవారు.  కానీ సినిమా చరిత్రలోనే సమంత ఓ కొత్త నాంది పలకబోతుంది అనే మ్యాటర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత తీసుకున్న డేసీషన్ అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది. చాలామంది జనాలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


త్వరలోనే డైరెక్టర్ నందిని రెడ్డి హీరోయిన్ సమంత కాంబోలో సినిమా రాబోతున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.  అంతేకాదు సమంత నిర్మాణం లోనే ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . సమంత సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆల్మోస్ట్ ఆల్ అఫీషియల్ టాక్ బయటకు వచ్చేసింది . అయితే ఈ సినిమా మొత్తం కూడా రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ తో తెరకెక్కబోతుందట. కాగా ఈ సినిమాకి బంగారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది .



ఈ సినిమాకి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పురుషులకు ఎలాంటి వేతన్నం ఇస్తారో  మహిళలకు కూడా అలాంటి వేతనం ఇవ్వాలి అంటూ సమంత నిర్ణయం తీసుకుందట . ఇప్పటివరకు సినిమా చరిత్రలో ఏ బడా ప్రొడెక్షన్ సంస్థ కానీ ఏ డైరెక్టర్ కానీ ఈ విధంగా చేయలేదట . ఫస్ట్ టైం సమంతనే ఇలాంటి నిర్ణయం తీసుకుందట . సమంత తీసుకున్న ఈ నిర్ణయం పై అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఇలాంటి నిర్ణయం సమంత తప్పితే మరి ఎవరు తీసుకోలేరని సమంత మంచి మనసుకే ఇది సాధ్యమని చెప్పుకొస్తున్నారు.  ప్రజెంట్ సినిమా ఇండస్ట్రిలో సోషల్ మీడియాలో సమంత తీసుకున్న ఈ నిర్ణయం బాగా వైరల్ గా మారింది . అంతే కాదు పెద్ద పెద్ద సినిమాలను తెరకెక్కించే రాజమౌళి - ప్రశాంత్ నీల్ - సుకుమార్ సైతం ఇలాంటి స్ట్రాంగ్ డెసీషన్ తీసుకోలేరు అని జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: