
అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్ సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ పప్పులు ఏ మాత్రం ఉడకడం లేదట. దర్శకుడు సందీప్ రెడ్డికంటూ ఓ స్పెషాలిటీ ఉంది. సినిమాని ఎంత ప్రేమిస్తాడో తెలిసిందే. అందుకే అతడి నుంచి అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు వచ్చాయి. స్పిరిట్ విషయంలో పక్కా క్లారిటీ తో ఉన్నాడు. ప్రభాస్ షరతులు పెట్టడం కాదు.. ప్రభాస్ కే మనోడు కండీషన్లు పెడుతున్నాడట. తన సినిమా షూటింగ్ మొదలు అయ్యి .. పూర్తయ్యే వరకు మరో సినిమా షూటింగ్ చేయకూడదని ఇప్పటికే చెప్పేశాడట.
ఎందుకంటే ‘ స్పిరిట్ ’ లుక్ వేరు. ఆ లుక్‌తో బయట ఎక్కువగా కనిపించకూడదని చెప్పాడట. కాల్సీట్లు వారానికి రెండు మూడు రోజులు ఇస్తే కుదరదు అని .. బల్క్ గా ఇవ్వాలని కూడా ఇప్పటికే చెప్పేశాడట. బాడీ డబుల్స్‌పై ఆధారపడి షాట్లు ఉండవు ... అసలు డూప్ ప్రస్తావన ఉండకూడదని చెప్పగా ప్రభాస్ ఒప్పుకున్నాడట. ఏదేమైనా అక్కడ ఉంది ప్రభాస్ అయినా ఇక్కడ సందీప్ రెడ్డి ముందు అవేమి పని చేయవు అనే అనుకోవాలి.