
ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా ... మరొకరు చేయడం సర్వసాధారణం. సరిగ్గా ఆడదేమో అని అనుమానంతో ఒక హీరో వదిలేసిన కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ ఉంటారు. అలాగే కొందరు హీరోలు వదులుకున్న సినిమాను మరో హీరో చేసి డిజాస్టర్లకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వద్దనుకున్న సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏకంగా బన్నీ కెరీర్నే మలుపు తిప్పింది. ఆ సినిమా ఏదో కాదు ? ఆర్య. 2004లో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో బన్నీ హీరోగా సుకుమార్ దర్శకుడుగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా ఆర్య. ఈ సినిమాతో అనురాధా మెహతా హీరోయిన్గా పరిచయం అయింది. శివబాలాజీ కూడా బన్నీకి పోటీ పాత్రలో నటించాడు.
లెక్క ప్రకారం ఈ సినిమా ప్రభాస్ చేయాల్సిన సినిమా. ముందుగా ఈ సినిమా కథను ప్రభాస్ కి వినిపించాడట దర్శకుడు సుకుమార్. కథ ప్రభాస్ కు కూడా బాగా నచ్చింది .. అయితే వన్ సైడ్ లవ్ పాత్రలు చేయనని ప్రభాస్ చెప్పడంతో చివరకు ఆ కథ అటు ఇటు తిరిగి బన్నీ చేతికి వెళ్ళింది. బన్నీ కి వెంటనే కథ నచ్చడంతో పాటు ఓకే చెప్పేసాడు. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. అలా ఏ కథ ఎవరికి రాసిపెట్టి ఉందో ? ఎవరు చెప్పలేరు అనేందుకు ఇది ఉదాహరణ. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుసగా స్పిరిట్ - రాజా సాబ్ - సలార్ 2 - కల్కి 2 సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. ఇక బన్నీ విషయానికి వస్తే పుష్ప 1 , పుష్ప 2 సినిమాలతో తిరుగే లేని పాన్ ఇండియా ఇమేజ్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.