
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని 18 నెలలలో పూర్తి చేసి 2027 సంక్రాంతికి విడుదల చేయాలి అన్న టార్గెట్ లో రాజమౌళి ఉన్నట్లు టాక్. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీలో మహేష్ పాత్ర కాశీ నుండి మొదలై ఆఫ్రికాలోని అడవుల వరకు వెళుతుందని అంటున్నారు. కాశీ లోని ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘాట్ తో పాటు కాశి పరిసరాలను ప్రత్యేకంగా సెట్ రూపంలో భాగ్యనగరంలో వేసి అక్కడ ఈ సినిమాకు సంబంధించిణ కీలక సన్నివేశాలను ప్రస్తుతం రాజమౌళి చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే హీరో మహేష్ ఫారెస్ట్ కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాశీ పుణ్యక్షేత్రంలో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈమూవీకి రచన చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ రామాయణంలో హనుమాన్ నేపధ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈకథను అల్లారని తెలుస్తోంది. అయితే మహేష్ ఆఫ్రికన్ అడవుల వైపు ఎందుకు వెళ్ళాడు డాని వెనుక ఉన్న సెంటిమెంట్ ఏమిటి అన్న పాయింట్ ఈసినిమా కీలక పాత్రలలో నటిస్తున్న నటీనటులకు తప్ప మారెవ్వరికీ తెలియదు అని అంటున్నారు.
అంతేకాదు ఈసినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి ఆ పాటలను ఎక్కడ ఘాట్ చేస్తారు అన్న విషయాన్ని కూడ జక్కన్న చాల రహస్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ఈసినిమాకు సంబంధించి ఎంఎం కీరవాణి కొన్ని ట్యూన్లు సిద్ధం చేసి ఉంచారని వాటిని రాజమౌళి ఓకె చేసిన తరువాత ఆ పాటల రికార్డింగ్ ఉంటుంది అని అంటున్నారు..