
దేవర సినిమాలోని సాంగ్స్ ఇతర దేశాలలోని సోషల్ మీడియా యూజర్స్ కూడా రీల్స్ చేస్తూ పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉండేవారు. సంగీతాన్ని అనిరుద్ అందించడంతో ఈ పాటలకు మరింత ప్లస్ అయింది. చుట్ట మల్లే సాంగ్ ఎక్కడ చూసినా భారీగానే వినిపించింది మరొక పాట దావూదీ సాంగ్.. ఈ పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. చాలామంది ఈ స్టెప్పులను సైతం వేస్తూ రిల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అయినా ఫరియా అబ్దుల్లా కూడా దేవర చిత్రంలోని ఈ పాటకు డాన్స్ వేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో కదా వైరల్ గా మారుతున్నది. అయితే ఈ ఏడాది నిర్వహించిన షి తెలుగు నక్షత్రం అవార్డుకి సైతం ఈమె కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫరియా తన డాన్స్ పెర్ఫార్మషన్స్ తో అందరిని ఆకట్టుకున్నది. ఈ సాంగ్ కోసం ఆమె భారీగానే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లుగా ఈ వీడియో అయితే కనిపిస్తోంది. మొత్తానికి దేవర విడుదలై ఎన్నో నెలలు కావస్తువున్న ఇప్పటికీ దేవరెంజ్ తగ్గలేదని అభిమానులు భావిస్తున్నారు. చివరిగా మత్తు వదలరా వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఫరియా తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.