- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సిద్ధమైంది. రిలీజ్ పై సవాలక్ష అనుమానాలు ఉన్న సినిమా మాత్రం రెడీ అవుతుంది. పవన్ పైకి వస్తే పార్ట్ వన్ రెడీ అయిపోతుంది. మార్చి 28 రిలీజ్ డేట్ అంటూ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఓవైపు పవన్ సినిమా ఉందని తెలిసినా కూడా నితిన్ రాబిన్‌హుడ్ సినిమాను అదే డేట్కు వేశారు.. పైగా సీక్వెల్ సినిమాను కూడా అదే డేడ్‌కు వదులుతున్నారు. పవన్ సినిమా కచ్చితంగా వస్తుందని తెలిస్తే ఈ రెండు సినిమాలు అంత డేర్ చేయవు. అయితే హరిహర వీరమల్లు సినిమా కచ్చితంగా రాదన్న నమ్మకంతోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్ వన్ షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే పవన్ ఎప్పుడు ? డేట్లు ఇస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి.


గట్టిగా రెండు వారాల మాత్రమే టైం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పుడు కొన్ని ఎక్స్‌క్లూజివ్‌డీటెయిల్స్ బయటకు వచ్చాయి. వీరే మల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ ఓ మిషన్ కోసం ఆమె కోటలో అడుగుపెడుతుంది. తప్పించుకునే మార్గం కోసం ఎదురు చూస్తున్న టైం లో వీరమల్లు తారసపడతాడు. వీర‌ మల్లు సాయంతో ఆమె కోట నుంచి తప్పించుకుంటుంది. అక్కడితో ఆమె పోర్షన్ కట్ అవుతుంది. మిగిలినది పార్ట్ 2 లో చూపిస్తారు. అలా పార్ట్ 1లో ఆమె పోషించిన పంచమి పాత్ర అర్ధాంతరంగా మాయమవుతుందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందని .. ఇందులో గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్ ప‌డ‌వ‌లోకి ఎక్కిస్తున్న వజ్రాలని దొంగతనం చేయడానికి వస్తాడు. పడవ ఓనర్ మురళి శర్మకు చెప్పి మరి అతడు దొంగతనం చేసే సీన్‌ హైలెట్. ఈ క్రమంలో పడవపై వచ్చే ఫైట్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుందట. స్టోరీ అయితే వినటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: