- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


సినిమా వాళ్లు ... సినిమా సెలబ్రిటీలు పెద్దగా వివాదాల జోలికి వెళ్లేందుకు ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు అనుకోకుండాను లేదా నోరు జారీ లేదంటే పరిస్థితి వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. గత కొద్దిరోజుల నుంచి హీరోయిన్ రుక్సార్ థిల్లాన్‌ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటుంది. ఆమెకు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆమె కు మరోసారి అవ‌మానం జరిగింది. రుక్సార్ థిల్లాన్‌ తెలుగు లో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించారు. రుక్సార్ తాజాగా నటించిన సినిమా దిల్ రూబా. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. గత ఏడాది క లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించిన కిరణ్ అబ్బవరం పెళ్లి తర్వాత చేసిన సినిమా కావడం తో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల లో కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నాయి.


సినిమా మార్చి 14న ధియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్ల లో భాగంగా ఫోటోగ్రాఫర్లతో హీరోయిన్ ఒకసారి కు చిన్న పాటి గొడవ జరిగింది. తనకు ఇబ్బందిగా ఉందని చెప్పిన సరే ఫోటోలు తీస్తున్నారని ఆమె కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా ఈవెంట్స్ కవర్ చేసే ఫోటోగ్రాఫర్లు రుక్సార్ ను పట్టించుకోవడం లేదు. తాజాగా హైదరాబాదులో మంగళవారం రాత్రి దిల్ రూబా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చివరలో టీమ్ అంతా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .. కానీ రుక్సార్ ను మాత్రం సైడ్ అయిపోమని ఫోటోగ్రాఫర్లు చెప్పారు. దీంతో ఆమె పక్కకు తప్పుకుంది. ఇది నిజంగా టాలీవుడ్ హీరోయిన్ కి జరిగిన అవమానంగా చెప్పాలి. మరి ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: