
కేతిక శర్మ ఈ సాంగ్ లో కనిపించగా ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా సాహిత్యం బాగానే ఉంది. అయితే కేతిక శర్మ హుక్ స్టెప్ విషయంలో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిస్టర్ బచ్చన్, పుష్ప2, డాకు మహారాజ్ సినిమాల సాంగ్స్ విషయంలో శేఖర్ మాస్టర్ పై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
అయితే ఆ విమర్శలు సాంగ్స్ కు వ్యూస్ పరంగా ప్లస్ అవుతున్నాయి. ఈ నెల 28వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ కానుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కావడం గమనార్హం. హరిహర వీరమల్లు రిలీజయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఈ సినిమాలు ఆ తేదీకి విడుదల కానున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
రాబిన్ హుడ్ సినిమా కేతిక శర్మకు ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి. ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించని నేపథ్యంలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ పై దృష్టి పెట్టారు. రాబిన్ హుడ్ సినిమా సక్సెస్ సాధిస్తే కేతిక శర్మ సైతం కెరీర్ పరంగా బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. హీరోయిన్ కేతిక శర్మ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.