సినిమా ఇండస్ట్రీలో రకరకాల విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయనే సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో సినిమాలు సక్సెస్ సాధించకపోయినా ఆ సినిమాల్లో కొన్ని సీన్స్, సాంగ్స్ హిట్టవుతూ ప్రేక్షకులను మ్యాజిక్ చేస్తుంటాయి. తెలుగులోని అలాంటి సాంగ్స్ లో ఆగడు సినిమాలోని నీ జంక్షన్ లో సాంగ్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
 
భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా ఈ పాటలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని అప్పట్లో సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ సాంగ్ లో శృతి హాసన్ డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. అయితే ఆగడు మూవీ దూకుడు మూవీకి కాపీలా ఉందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాలో మూడు సినిమాలకు సరిపడా డైలాగ్స్ ఉన్నాయని కూడా కామెంట్లు వినిపించాయి.
 
అయితే ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఈ సాంగ్ వేరే లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆగడు సినిమా అప్పట్లో కలెక్షన్ల విషయంలో సైతం నిరాశకు గురి చేసింది. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా తక్కువగానే కలెక్షన్లను సాధించిందని చెప్పవచ్చు. శ్రీనువైట్ల కెరీర్ కు ఈ సినిమా నుంచి వరుస బ్రేకులు పడ్డాయి.
 
సినిమా తర్వాత శ్రీనువైట్ల తెరకెక్కించిన సినిమాలన్నీ అంచనాలను అందుకోలేక విఫలమయ్యాయి. శ్రీనువైట్ల మళ్లీ క్రేజీ ప్రాజెక్ట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఆ మ్యాజిక్ జరగడం లేదు. శ్రీను వైట్లకు రాబోయే రోజుల్లో కొత్త మూవీ ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. శ్రీనువైట్లకు పూర్వ వైభవం వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే తర్వాత రోజుల్లో మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను సాధించిన సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: