ఏంటి హీరో నాని కోర్టు మూవీ ని తీయడం వెనక అల్లు అర్జున్ ని అవమానించడం కోసమేనా.. ఇంతకీ నటుడు ప్రియదర్శి మాట్లాడిన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? కోర్టు మూవీకి బన్నీ అరెస్ట్ అవ్వడానికి వెనుక ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాని నిర్మాణ సారథ్యంలో వస్తున్న కోర్టు మూవీలో ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి పాటలు, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. అలా మార్చి 14న విడుదల కాబోతున్న కోర్టు మూవీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియదర్శిసినిమా తీయడానికి కారణం అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోర్టు సినిమాలోని సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అయితే సంధ్య థియేటర్ తొక్కీసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో నిరంజన్ రెడ్డి గారు ఎలా అయితే కొన్ని చట్టాల గురించి కోర్టులో వాదించారో వాటిని చూసి మేము మా కోర్టు సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం డబ్బింగ్ మార్చుకున్నాం. ఇక ఈ కోర్టు రూమ్ సన్నివేశాలు చూసిన సమయంలో మీ అందరికీ దగ్గరుండి చూస్తున్నాం అనే భావన కలిగి రియాలిటీగా అనిపిస్తుంది.. అంటూ ప్రియదర్శి చెప్పుకొచ్చారు.అయితే ప్రియదర్శి మాటలపై కొంతమంది నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొంత మంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. 

అల్లు అర్జున్ ని బ్యాడ్ చేయడం కోసమే నాని కోర్టు మూవీని తెరకెక్కిస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇందులో అల్లు అర్జున్ ని బ్యాడ్ చేయడానికి ఏమీ లేదు.ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు అయిన సమయంలో కోర్టులో లాయర్ నిరంజన్ రెడ్డి చాలా అద్భుతంగా వాదించారు. అయితే ఆయన వాదించచిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.  దాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ సినిమాలోని కోర్టు రూమ్ కి కొన్ని సన్నివేశాలు చేసాం అంటూ ప్రియదర్శి చెప్పుకొచ్చారు.. ఇక కోర్టు మూవీకి సంబంధించిన  "కథలెన్నో చెప్పారు కవితలు రాసారు" అనే పాట సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: