ప్రముఖ స్టార్ దర్శకుడు శంకర్ కు మద్రాస్ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది .. శంకర్ చెరస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ తీసుకున్న నిర్ణయం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది .. సూపర్ హిట్ అయిన సినిమా ‘ఎంథిరన్’ లో ఆర్థిక అవకతవకలు జరిగాయి అంటూ డైరెక్టర్ శంకర్ పై కేసు నమోదయింది .. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ , ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన రోబో సినిమాలో నటించారు .. ఇక ఈ సినిమాని హిందీలో రోబోట్ పేరుతో రిలీజ్ చేశారు ..


అయితే ఈ సినిమాకు సంబంధించిన వివాదం కారణంగా శంకర్ కు సంబంధించిన 11.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడి జప్తు చేసింది . అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు నిర్ణయం నుంచి శంకర్ కు భారీ ఉరాట లభించినట్టయింది .. అయితే ఈ కేసు విచారించిన హైకోర్టు ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదు పై ఇప్పటికే స్టే కూడా ఇచ్చింది .. అలాగే శంకర్ ఆస్తిని  జప్తు చేయడం కూడా సమర్ధనీయం కాదని కోర్టు తీర్పులో పేర్కొంది .. అయితే ఒక ప్రైవేట్ ఫిర్యాదు పై స్టే విధించేటప్పుడు డైరెక్ట్ ఆస్తిని స్తంభింపజేయడం మంచి పద్ధతి కాదు అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది ..


అలాగే ఈడీ చర్యను సవాల్‌ చేస్తూ శంకర్ దాఖలు చేసీన‌ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు కూడా వచ్చాయి .. ఇక దీంతో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం శంకరకు గట్టి ఉపసామనం ఇచ్చింది .. ఈ విషయంలో చట్టపరమైన ప్రక్రియ ఇంక కొనసాగుతూనే ఉంది. రోబో సినిమా వివాదం శంకర్ ఆస్తి స్తంభింపజేసినట్లు వచ్చిన వార్తలు .. చిత్ర‌ పరిశ్రమలో హాట్ టాపిక్ లో మారాయి .. అయితే ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో ఈ విషయం మరో కొత్త మలుపుకు తిరిగింది .. అలాగే ఈ కేసును చిత్ర పరిశ్రమకు చెందిన వారు శంకర్ అభిమానులు ఎంతో గాఢంగా గమనిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: