
విజయ్ నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు ఇస్లామును అవమానించేలా ఉందని ఆరోపణలు చేస్తూ తమిళనాడు సున్నత్ జమాత్ నాయకుడు విజయ్ పై ఫిర్యాదు చేశారు .. అలాగే ఈ కేసును దర్యాప్తు చేసి విజయ్ పై చర్యలు తీసుకోవలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్ కు విజయ్ పై కంప్లైంట్ చేశారు .. విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఇస్లామును ముస్లింలను అవమానించారని ఫిర్యాదుల పేర్కొన్నారు .. విజయ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో తాగుబోతులు , రౌడీలు కూడా ఉన్నారని వారు చెబుతున్నారు .. విజయ్ పార్టీలో దుండగులు , రౌడీలు పాల్గొన్నారు తమ దృష్టికి వచ్చిందని .. అలాగే ఉపవాసం ఉండని రంజాన్ పట్ల గౌరవం లేని వ్యక్తులు కూడా విందులో పాల్గొన్నారు ..
ఇక ఇది ముస్లిం సమాజానికి అవమానం అలాగే ఇఫ్తార్ విందు నిర్వహణ కూడా ఎంతో బాధితరహితంగా ఉంది .. విజయ్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వచ్చిన వారితో ఎంతో దురుసుగా ప్రవర్తించారు ప్రజలను ఆవుల మాదిరిగా ఈడ్చుకు వెళ్లి పడేశారు అంటూ ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. విజయ్ రీసెంట్గా చెన్నైలోనే వైఎంసీఏ మైదానంలో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాడు .. అయితే ఆరోజు విజయ్ కూడా ముస్లింలతో కలిసి ప్రార్థనలు కూడా చేశారు . విజయ్ ఇఫ్తార్ పార్టీ నిర్వహించినందుకు విమర్శలు తెచ్చుకున్నారు .. విజయ్ హిందువుల పండుగలను నిర్వహించకపోవడం పట్ల కూడా చాలామంది ఆయనను విమర్శించారు . కానీ ఇప్పుడు విజయ్ తమను కావాలని అవమానించారన్నీ ఆరోపిస్తూ ముస్లింలు ఆయనపై ఫిర్యాదు చేశారు . విజయ్ పై ఇంకెన్ని ఆరోపణ వస్తయో చూడాలి.