
ఒక కథను ముంగుకు తీసుకెళ్లాలంటే శృంగారం మాత్రమే ముఖ్యమని నేను భావించనని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు. అలా అని అలాంటి సీన్స్ లో నటించడానికి ఇష్టం లేదని కూడా నేను చెప్పడం లేదని కరీనా కపూర్ కామెంట్లు చేశారు. నిజంగా అలాంటి శృంగారాన్ని చూపించాలని అనుకుంటే మాత్రం అది కథలో ప్రాసెస్ లా ఉండాలని కరీనా కపూర్ చెప్పుకొచ్చారు.
ఎంతో కష్టపడి కథ డిమాండ్ చేసిందని శృంగార సన్నివేశాల్లో నటిస్తే భారతీయ సమాజం మాత్రం ఆ సన్నివేశాలను మరో విధంగా అర్థం చేసుకుందని కరీనా కపూర్ పేర్కొన్నారు. మన దేశీయులు పాశ్చత్య దేశాలలా ఓపెన్ గా ఉండరని కరీనా కపూర్ వెల్లడించారు. మన దేశీయులు శృంగారం విషయంలో ఇంకా ఓపెన్ కాలేదని ఆమె పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో స్త్రీల కోరికలు ఓపెన్ గా చెబుతారని ఆమె వెల్లడించారు.
అయితే ఒక్కో దేశంలో ఒక్కో సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయని ఎవరి అభిరుచులు, అభిప్రాయాలు వారివని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కరీనా కపూర్ వయస్సు ప్రస్తుతం 44 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కరీనా కపూర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కరీనా కపూర్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.