ఏంటి నిజంగానే శ్రీలీల ఆ హీరోని ప్రేమిస్తుందా.. వారిద్దరూ డేటింగ్ చేస్తుంది నిజమేనా.. ఆ హీరో తల్లి చెప్పిన మాటల్లో ఉన్న నిజం ఎంత.. ఇంతకీ శ్రీలీల ఎవరితో డేటింగ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.. గత కొద్దిరోజుల నుండి బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నో వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వార్తలు నిజమే అనేంతలా శ్రీలీల ఆయనతో కలిసి ఫ్యామిలీ పార్టీలలో కూడా పాల్గొంటుంది. రీసెంట్ గానే శ్రీలీల కార్తిక్ ఆర్యన్ సోదరి ఇచ్చిన పార్టీలో పాల్గొనడంతో వీరి మధ్య డేటింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఈ విషయం నిజమే అన్నట్లుగా ఐఫా అవార్డ్స్ లో పాల్గొన్న కార్తిక్ ఆర్యన్ తల్లిని మీకు ఎలాంటి కోడలు కావాలి అని అనుకుంటున్నారు అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. మా ఇంటి కి కోడలుగా  ఒక మంచి డాక్టర్ రావాలని కోరుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది. ఇక కార్తీక్ ఆర్యన్ తల్లి సమాధానంతో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ నిజమేనని అందరికీ అర్థం అయిపోయింది. ఎందుకంటే శ్రీలీల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే వీరి డేటింగ్ రూమర్లు చక్కర్లు కొడుతున్న వేళ కార్తీక్ ఆర్యన్ తల్లి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కార్తీక్ ఆర్యన్ తల్లి శ్రీలీలను ఉద్దేశించే ఇలా మాట్లాడిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక కార్తిక్ ఆర్యన్ తో కలిసి శ్రీ లీల ఆషిక్యూ  3 అనే మూవీలో నటిస్తోంది. ఇక శ్రీలీలకి ఇదే మొదటి బాలీవుడ్ మూవీ. ఈ సినిమా షూటింగ్ కోసం శ్రీలీల ముంబై కి వెళ్ళిన సమయంలో కార్తీక్ ఆర్యన్ తో సన్నిహితంగా కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: