
అయితే ఇప్పుడు ఈ విషయం పై అధికార ప్రకటన రాలేదు .. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ పక్క మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు . ఇక వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ రీసెంట్ గానే జెప్టో యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ లుక్స్ పై భారీగా ట్రోలింగ్ కూడా జరిగిన విషయం తెలిసిందే .. ఇప్పుడు ఊహించిన అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు భారీ కిక్ంచాడు ఎన్టీఆర్ .. బ్లాక్ జీన్స్ డెనిమ్ షార్ట్ లో స్టైలిష్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు ..
ఇక దీంతో అభిమానులు ఇప్పుడు ఆ ఫోటో లను సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తూ తమ ఆనందం పంచుకుంటున్నారు .. వార్ 2 , ప్రశాంత్ నీల్ సినిమాల కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తుంది . అయితే ఇప్పుడు హిందీలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా షూట్ కు తాత్కాలికంగా బ్రేక్ పాడినట్టు తెలుస్తుంది .. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్లో ఓ సాంగ్ షూటింగ్లో హృతిక్ రోషన్ గాయపడినట్టు టాక్ .. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది .. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది .